
తెలంగాణ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐదు రోజులుగు కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జైనథ్ మండలం డొలారా వద్ద పెన్‌గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెన్ గంగ ప్రవాహం 50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనను తాకింది. దీంతో తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని 44వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
వరద ఉధృతి తగ్గిన తర్వాత వాహనాల రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి డొలారా వంతెన వద్ద పెన్‌గంగ ఉధృతిని పరిశీలించారు. పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్లే వాహనాలను జైనథ్ మండలంలోని పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.