వేలాల గ్రామంలో మహాశివరాత్రి జాతర హుండీ లెక్కింపు

వేలాల గ్రామంలో మహాశివరాత్రి జాతర హుండీ లెక్కింపు

జైపూర్, వెలుగు:  వేలాల మహాశివరాత్రి జాతర కురూ. 46 ,90, 265 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ రమేశ్  తెలిపారు. శుక్రవారం వేలాల గ్రామంలోని ప్రభుత్వ స్కూల్ ఆవరణలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, ఎస్ఐలు శ్రీధర్, నాగరాజు, ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీఓ బాపురావుల సమక్షంలో హుండీలు లెక్కించారు. 

 సాయంత్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం  గుట్టపైన ప్రత్యేక దర్శనం, ప్రసాదం, టిక్కెట్లు, హుండీల ద్వారా 18 ,47,810 ఆదాయం రాగా, గురువారం గుట్ట కింద జరిగిన జాతరలో ప్రత్యేక దర్శనం, ప్రసాదం, టిక్కెట్ల ద్వారా 28 ,42, 455 రూపాయల వచ్చిందన్నారు. 2,800 గ్రాముల బంగారం, 1.650 గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు.