
సిద్దిపేట టౌన్, వెలుగు: తెలంగాణకు పట్టిన శనీశ్వరుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, పాల సాయిరాం, ఫారుక్ హుస్సేన్ లు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చి విచక్షణ కోల్పోయి మాట్లాడారన్నారు.
సిద్దిపేట ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. సిద్దిపేటను కేసీఆర్, హరీశ్ రావు దేశంలోనే ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దారన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు ఓట్లతో బుద్ధి చెబుతారన్నారు. సిద్దిపేటకు మంజూరైన వెటర్నరీ కళాశాలను కొడంగల్ కు తరలించిన రేవంత్ రెడ్డి ఏ రకంగా సిద్దిపేట ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.