చంద్రబాబు ఆదేశంతోనే బోండా టీమ్ దాడి చేసింది.. వెల్లంపల్లి

సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో శరవేగంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని కోర్ట్ ఆదేశాలతో రిమాండ్ కి తరలించారు.ఈ కేసులో A2 అయిన దుర్గారావుకు స్థానిక టీడీపీ నాయకుడు బోండా ఉమ ఆఫీసులో పని చేసే ఉద్యోగి కావటంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఈ దాడికి సూత్రదారి బోండా ఉమ అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో దాడిలో సీఎం జగన్ తో పాటు గాయపడ్డ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే బోండా ఉమా టీమ్ ఈ ఘాతునికి పాల్పడ్డారని అన్నారు. ఈ దాడిలో తన ప్రమేయం లేకుంటే బోండా ఎందుకు భయపడుతున్నారని అన్నారు. వారే దాడికి పాల్పడి మేము రాళ్లు వేయించుకున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. గులక రాయి అంటూ చంద్రబాబు అవహేళన చేస్తున్నాడని అన్నారు. అధికారులను సైతం బోండా బెదిరిస్తున్నారని, సుమోటోగా తీసుకొని ఈసీ చర్యలు తీసుకోవాలని అన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. 

Also Read:విజయవాడ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత...