కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. శనివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది.అత్యధికంగా పాల్వంచ మండలం వెల్పుగొండలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
కొల్లూర్‌లో 45.6, రామారెడ్డిలో 45.3, బిచ్కుందలో 45.1 , డొంగ్లిలో 44.7, దోమకొండ, పిట్లంలో 44.6, భిక్కనూరు, హాసన్‌పల్లిలో 44.4, పుల్కల్, పెద్దకొడప్గల్, మహ్మాదపూర్ల్లో 44.1, లింగంపేట, మాచాపూర్‌లో 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది.