నీతి ఆయోగ్‌ను నడిపించేవి ఐడియాలే ..

నీతి ఆయోగ్‌ను నడిపించేవి ఐడియాలే ..

నెహ్రూ ఆరంభించిన వ్యవస్థల్లో ముఖ్యమైంది ప్లానింగ్‌‌‌‌ కమిషన్‌‌‌‌. తనకెంతో ఇష్టమైన సోషలిజాన్ని నమూనాగా తీసుకుని రూపొందించిన వ్యవస్థ అది. నెహ్రూ తీసుకున్న మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎకానమీ సిస్టమ్‌‌‌‌లో దేశాభివృద్ధికి ప్లానింగ్‌‌‌‌ చేసేది. ప్రతి అయిదేళ్లకూ సమీక్షించుకుని ఆ తర్వాత వచ్చే అయిదేళ్లకు కొత్త లక్ష్యాలను రూపొందించేది. మోడీ అధికారానికొచ్చాక 65 ఏళ్లుగా నడుస్తున్న వ్యవస్థను రద్దు చేసి, నీతి ఆయోగ్‌‌‌‌ని ఏర్పాటు చేశారు.  అవసరమైన ఐడియాలనిస్తూ థింక్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌లా పనిచేస్తుంది. మోడీ తీసుకున్న అనేక నిర్ణయాల వెనుక ఈ థింక్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌ ఆలోచనలున్నాయి. నీతి ఆయోగ్​ను నడిపే జట్టును టీమిండియా అని ప్రధాని మోడీ అంటారు.

నీతి ఆయోగ్ ( నేషనల్ ఇన్ స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫామింగ్ ఇండియా)  ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలకు ప్రతిరూపం. జవహర్ లాల్ నెహ్రూ కాలం నాటి ప్రణాళికా సంఘం (ప్లానింగ్ కమిషన్)  స్థానంలో పుట్టిన కొత్త సంస్థ. నీతి ఆయోగ్ ఏర్పాటు గురించి  తొలిసారి 2014 ఆగస్టు 15న   మోడీ ప్రకటించారు. ఫెడరల్ పద్ధతినే  కొనసాగిస్తూ 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పాటైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే అభివృద్ధి అజెండాను ఖరారు చేయడమే నీతి ఆయోగ్ లక్ష్యమని ప్రధాని మోడీ చెప్పారు. వీటన్నిటితో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఒక థింక్ టాంక్‌‌లా  నీతి ఆయోగ్ పనిచేస్తుంది.  దేశాభివృద్ధికి అవసరమైన తాజా ఐడియాలను అధికారంలో ఉన్నవారికి ఇవ్వడం, వారితో ఆ విషయాలకు సంబంధించి షేర్ చేసుకోవడం కూడా నీతి ఆయోగ్ విధుల్లో భాగమే. కేవలం ఒక థింక్ ట్యాంక్ లానే కాదు అవసరమైతే  యాక్షన్ ట్యాంక్‌‌లానూ నీతి ఆయోగ్ పనిచేస్తుందంటారు అధికారులు.  ఆర్థిక రంగంలో మార్పుకు దారి తీసే రకరకాల పథకాలను తయారు చేయడం, వాటిని అమలు పరిచేలా చూడడం  నీతి ఆయోగ్ చేసే అసలు పని.

జాతీయ ప్రయోజనాలే ముఖ్యం

ఖజానాకు సంబంధించిన  వ్యూహాలు, విధానాల  రూపకల్పనలో   దేశమంతా లాభపడేలా నీతి ఆయోగ్ చూస్తుంది. ఇన్నేళ్లుగా ప్రయోజనం పొందలేకపోయిన కులాలపై ప్రత్యేకంగా  దృష్టి పెడుతుంది. అభివృద్ధి కృషిలో  దేశ ప్రజలను భాగస్వాములుగా  చేస్తుంది. అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి వీలుగా పథకాలు రూపొందిస్తుంది.  ప్లానింగ్ కమిషన్ లో  రాష్ట్రాల పాత్ర  చాలా తక్కువగా ఉంటుంది. నీతి ఆయోగ్ దీనికి డిఫరెంట్. నీతి ఆయోగ్ వ్యవస్థలో  రాష్ట్రాల పాత్ర ఎక్కువగా ఉంటుంది.

ప్రతి రాష్ట్రంతోనూ ఇంటరాక్ట్ అవుతుంది. అక్కడి ప్రజల లైఫ్ స్టయిల్ మెరుగుపరచడానికి తీసుకోవలసిన చర్యల గురించి మాట్లాడుతుంది. సూచనలు, సలహాలు ఇస్తుంది. గతంలో ఉన్న ప్లానింగ్ కమిషన్ వీటికి దూరంగా ఉండేది. ఏళ్లు గడిచేకొద్దీ సమాజంలో పరిస్థితులు మారాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్లానింగ్ కమిషన్ తన పనితీరు మార్చుకోలేకపోయిందన్న అభిప్రాయం చాలా ఏళ్లుగా వినిపిస్తోంది. ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ను తయారు చేయడం వంటి కొన్ని పనులకే ప్లానింగ్ కమిషన్ పరిమితం అయిందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రాలను కలుపుకని పోవడంలో ప్రణాళికా సంఘం ఫెయిల్ అయ్యిందన్న విమర్శలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో  ప్లానింగ్ కమిషన్ కన్నా మెరుగ్గా పనిచేసే ఒక సంస్థ ఉండాలన్న ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనలో నుంచే నీతి ఆయోగ్ సంస్థ పుట్టింది. మారిన ఆర్థిక పరిస్థితులు, మోడర్న్ టెక్నాలజీ, దాపరికం లేని పరిపాలన అనే అంశాల ప్రాతిపదికన నీతి ఆయోగ్ ఏర్పడింది.

ప్లానింగ్ కమిషన్ నేరుగా నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (ఎన్డీసీ)కి రిపోర్ట్ చేసి చేతులు దులుపుకుంటుంది. నీతి ఆయోగ్ అలా కాదు.  చైర్మన్‌‌గా ఉన్న ప్రధానికే జవాబుదారీగా ఉంటుంది. కొత్త సంస్థ పాలక మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. ఒక ఫుల్ టైమ్ డిప్యూటీ చైర్మన్‌‌తో పాటు కీలక బాధ్యతలు చూసే  సీఇఓ కూడా ఉంటారు. వీరితోపాటు ఐదుగురు ఫుల్ టైమ్ సభ్యులు అలాగే ఇద్దరు పార్ట్ టైమ్ సభ్యులు ఉంటారు. నలుగురు కేబినెట్ మంత్రులు  ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు.

నీతి ఆయోగ్ వ్యవస్థలో లోపాలు

నీతి ఆయోగ్ వ్యవస్థలో లోపాలు లేకపోలేదు. నీతి ఆయోగ్‌‌కి రాజ్యాంగ బద్ధత లేదు. పార్లమెంటుకు జవాబుదారీ కాదు. పాలక మండలిలో సభ్యులుగా కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన లెఫ్టి నెంట్ గవర్నర్లు ఉంటారు. అక్కడి ముఖ్యమంత్రులకు ఇక్కడ సభ్యత్వం ఇవ్వలేదు.

సోవియట్ మోడల్లో ప్లానింగ్ కమిషన్

వెనకటి సోవియట్ యూనియన్ మాదిరిగా  జవహర్ లాల్ నెహ్రూ ప్లానింగ్ కమిషన్ ను ఏర్పాటు చేశారు. రెండు ప్రపంచ యుద్ధాల వల్ల  దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, చాలా తక్కువ టైంలోనే అమెరికాకు దీటుగా సోవియట్ యూనియన్ అభివృద్ధి చెందిన తీరును నెహ్రూ ఆదర్శంగా తీసుకున్నారు. కేంద్ర కేబినెట్ తీర్మానం మేరకు 1950 మార్చి 15న మొదటి ప్లానింగ్  కమిషన్ ను ఏర్పాటు చేశారు. ప్లానింగ్ కమిషన్ తన 65 ఏళ్ల ప్రస్థానంలో 12 ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ను,  ఆరు యాన్యువల్ ప్లాన్స్ ను తీసుకువచ్చింది. ప్లానింగ్ కమిషన్ కు తెరపడటానికి అనేక కారణాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సోవియట్ తరహా ఆర్థిక వ్యవస్థ లు దెబ్బతిన్నాయి. పబ్లిక్ – ప్రైవేటు జోడీ వ్యవస్థ వల్ల జరగాల్సిన మేలు జరగడం లేదు. మార్కెట్ ఎకానమీ జోరందుకుంది. ఆర్థిక రంగంలో నియో లిబరలిజం ప్రాధాన్యం పెరిగింది. ఈ అన్ని మార్పులకు తగ్గట్టు ప్లానింగ్ కమిషన్  అప్ డేట్ కాలేకపోయింది. ఫలితంగా ప్లానింగ్ కమిషన్ కాలగర్భంలో కలిసిపోయి  కొత్తగా నీతి ఆయోగ్ అనే వ్యవస్థ తెర మీదకు వచ్చింది.

నీతి  ఆయోగ్
సాధించింది ఏంటి?

ఈ నాలుగేళ్ల  ప్రస్థానంలో  నీతి ఆయోగ్ ఖాతాలో చాలా విజయాలు ఉన్నాయి. పాలనలో  నరేంద్ర మోడీ తీసుకువచ్చిన అనేక సంస్కరణల వెనక నీతి ఆయోగ్ ఉంది. స్వచ్ఛ్​ భారత్ అభియాన్, డిజిటల్ ఇండియా, స్కిల్ డెవలప్ మెంట్ వంటి  హిట్ పథకాలన్నీ నీతి ఆయోగ్ ఆలోచనల నుంచి వచ్చినవే.