
- 2011లో అత్యధిక జనాభా కలిగి ఉన్న తొలి మూడు రాష్ట్రాలు వరుసగా ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్.
- 2011లో లింగనిష్పత్తి అధికంగా గల రాష్ట్రాలు వరుస కమ్రంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్.
- 2011 జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్ రాష్ట్రం గత దశాబ్దంలో మొత్తం అక్షరాస్యత విషయంలో అద్భుతమైన ప్రగతి సాధించింది. అయితే, రాజస్థాన్‌లో స్త్రీ, పురుష అక్షరాస్యత మధ్య ఎక్కువ అంతరం ఉంది.
- 2011లో సేకరించిన జనాభా లెక్కలు 1872 నుంచి మొదలుకొని 15 సార్లు జరిగాయి.
- 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం పురుష జనాభా 62.32కోట్లు.
- 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం స్త్రీ జనాభా 58.75 కోట్లు.
- 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనసాంద్రత 382.
- 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష జనాభా నిష్పత్తి 943.
- 2011 జనాభా లెక్కల ప్రకారం జనసాంద్రత పరంగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వరుసగా బిహార్, పశ్చిమబెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్.
- 0–6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల్లో అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న మొదటి నాలుగు రాష్ట్రాలు వరుసగా మిజోరాం, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్.
- 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వృద్ధిరేటు అధికంగా ఉన్న మొదటి నాలుగు రాష్ట్రాలు వరుసగా మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్, జమ్ముకశ్మీర్.
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గ్రామీణ, పట్టణ జనాభా శాతాలు వరుసగా 68.8శాతం, 31.2శాతం.
- భారతదేశంలో అత్యధిక, అత్యల్ప గ్రామీణ జనాభా కలిగి రాష్ట్రాలు మహారాష్ట్ర, సిక్కిం.
- దేశంలో ఎస్సీ జనాభా శాతం అధికంగా గల రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాలు వరుసగా పంజాబ్, చండీఘర్.
- ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం వరుసగా మిజోరాం, లక్షదీవులు.
- మహిళల్లో అత్యధిక, అత్యల్ప డబ్ల్యూఎఫ్పీఆర్ గల రాష్ట్రాలు వరుసగా హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్.
- 2011 జనాభా లెక్కల ప్రకారం వార్షిక జనాభా పెరుగుదల రేటు 1.84శాతం నమోదైంది.
- భారతదేశంలో శ్రామికులుగా 15 నుంచి 60 సంవత్సరాల మధ్యగల వయస్సు వారిని పరిగణిస్తారు.
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 45.6శాతం శ్రామికులు ప్రాథమిక రంగంపై ఆధారపడుతున్నారు.
- జనాభాలో సంపూర్ణ ఫలనత్వరేటు భావన అంటే ఒక స్త్రీ జీవితకాలంలో ఆమెకు పుట్టిన పిల్లల సగటు సంఖ్య.
- భౌతిక జీవన ప్రమాణ సూచీ లెక్కించడానికి కీలకమైన అంశాలు ప్రజల ఆయుర్ధాయం, శిశుమరణాల రేటు, అక్షరాస్యత.
- డమోగ్రఫిక్ డివిడెండ్ అంటే 15 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల మధ్యగల ఉత్పాదక జనాభా పెరిగి దేశ వృద్ధిరేటులో పెరుగుదల.
- జాతీయ నమూనా సర్వే ఆధారంగా 2011–12 సంవత్సరానికి ఇచ్చిన గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 3.4శాతంగా ఉంది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 350.6 మిలియన్ల పురుష శ్రామికులు ఉన్నారు.
- డెమోగ్రాఫిక్ డివిడెండ్ మొత్తం జనాభాలో ఉత్పత్తిలో భాగస్వాములయ్యే వారి సంఖ్య అధికంగా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది.
- భారత డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఫలాలను అందుకోవడానికి వీలుగా సమగ్ర సమీకృత జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్‌ను ఏర్పాటు 12వ ప్రణాళికలో సానుకూలత వ్యక్తం చేశారు.
- జనాభా పరివర్తన సిద్ధాంతం ప్రకారం మన దేశం రెండో దశలో ఉంది.
- 1911–21 దశాబ్దకాలంలో జనాభా పెరుగుదల రేటు రుణాత్మకంగా ఉంది. తర్వాత కాలంలో పెరగడం ప్రారంభించింది. అందువల్ల 1921 సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరంగా పరిగణిస్తారు.
- 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని శ్రామికులకు ఉపాధి కల్పించే ఏర్పాటు చేసింది.