
- అనంత పద్మనాభస్వామి ఆలయం అనంతగిరి గుట్టలలో విస్తరించి ఉంది.
- మహబూబ్‌నగర్‌లో షాబాద్ గుట్టలు, కోయిల్ గుట్టలు విస్తరించి ఉన్నాయి.
- శ్రీపర్వతం నల్లగొండ జిల్లాలో విస్తరించి ఉంది.
- అనంతగిరి గుట్టలు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి.
- కెరామెరీ ఘాట్స్ ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
- రాయగిరి గుట్టలు భువనగిరి జిల్లాలో ఉన్నాయి.
- రాఖీగుట్టలు జగిత్యాల జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
- నాగర్‌కర్నూల్ జిల్లాలో విస్తరించి ఉన్న తూర్పు కనుమలను నల్లమల కొండలు అని పిలుస్తారు.
- యల్లండ్లపాడు గుట్టలు ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
- కందికల్ గుట్టలు మహబూబాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
- సిర్పూర్ గుట్టలు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి.
- ఫతేమైదాన్ (విజయ మైదానం) ప్రాంతంలో ఎల్బీ స్టేడియం నిర్మించారు.
- తెలంగాణలోని పశ్చిమ కనుమలలో ఎత్తయిన శిఖరం మహబూబ్ఘాట్స్.
- రాయగిరి కోట తూర్పుకనుమలలో ఉంది.
- కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం రాఖీగుట్టలలో విస్తరించి ఉంది.
- గోల్కొండను గొల్లకొండ అని పిలిచేవారు.
- హథియా వృక్షం/ ఏనుగు చెట్టు గోల్కొండ కొండల్లో ఉంది.
- పాండవుల గుట్టలు భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి.
- కోయిల్ గుట్టలు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నాయి.
- రాతిగుట్టలు కామారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
- రాజు గుట్టలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి.
- షాబాద్ గుట్టలు మహబూబ్‌బాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
- ఇనుముకొండలు ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
- కామారెడ్డి, భూపాలపల్లి, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాల్లో పశ్చిమ కనుమల పంక్తులు విస్తరించి ఉన్నాయి.
- తూర్పు కనుమలను మమబూబ్‌నగర్ జిల్లాలో తూర్పు కొండలుగా పిలుస్తారు.
- తెలంగాణలోని తూర్పు కనుమల్లో ఎత్తయిన కొండ లక్ష్మీదేవి పల్లి సిద్దిపేట జిల్లాలో ఉంది.
- కృష్ణా– దిండి నదుల మధ్య ప్రీక్యాంబ్రియన్ శిలలు విస్తరించి ఉన్నాయి.
- బసాల్టు శిలలతో ఏర్పడిన ప్రాచీన కోత మైదానాలు రాష్ట్రంలో రంగారెడ్డి, గద్వాల్, సంగారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
- గోదావరి నది ఏర్పరిచే బైసన్ గార్జ్ పాపికొండల్లో విస్తరించి ఉంది.
- గోదావరి పరీవాహక ప్రాంతంలో లభించే అతి ముఖ్యమైన ఖనిజం నేల బొగ్గు.
- అతిపురాతన దర్వార్ శిలలు కర్ణాటక ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి.
- తెలంగాణలో గోండ్వానా శిలలు నేలబొగ్గుకు ప్రసిద్ధి.
- హసన్‌పర్తి కొండలు హనుమకొండ జిల్లాలో ఉన్నాయి.
- అమలుకొండ శ్రేణులు సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి.
- నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాలు ఆర్కియన్ శిలలతో విస్తరించి ఉన్నాయి.
- నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్ ప్రాంతం ప్లీస్టోసీన్ రకమైన శిలలతో నిర్మితమై ఉంది.
- ఆదిలాబాద్ జిల్లా మెసోజయిక్ శిలలతో ఏర్పడి ఉంది.
- ఆసిఫాబాద్ జిల్లాలో క్రెటాసియస్ శిలలు ఉన్నాయి.
- మహబూబ్ఘాట్స్ నిర్మల్ జిల్లాలో ఉన్నాయి.
- తెలంగాణ పీఠభూమిలో విస్తరించి ఉన్న కడప శిలల్లో ఉన్న ప్రధాన ఖనిజం సున్నపురాయి.
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో విస్తరించి ఉన్న తూర్పు కనుమలకు కడప శ్రేణులని మరోపేరు.
- దోమకొండ కామారెడ్డి జిల్లాలో ఉంది.
- కొండరెడ్లు ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నారు.
- తెలంగాణలో అత్యంత ఎత్తయిన జలపాతం కుంతాల.
- సప్తగుండాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
- బోగతా జలపాతం ములుగు జిల్లాలో ఉంది.
- తెలంగాణ నయాగరా అని బోగతా జలపాతాన్ని పిలుస్తారు.
- సవతుల గుండం జలపాతం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది.
- లక్నవరం సరస్సు భూపాలపల్లి జిల్లాలో ఉంది.
- రథంగట్టు జలపాతం కొత్తగూడెం ప్రాంతంలోని మణుగూరులో ఉంది.
- గాయత్రి/ గాడిద గుండం/ ముక్తిగుండం జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
- చింతామణి జలపాతం భూపాలపల్లి జిల్లాలో ఉంది.
- మల్లెల తీర్థం నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉంది.
- గుండాల జలపాతం వనపర్తి జిల్లాలో ఉంది.
- సలేశ్వరం జలపాతం నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉంది.
- గిడ్డలసిరి జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.