వైఎసార్సీపి నుండి మరో వికెట్ డౌన్ - ఎంపీ రాజీనామా..!

2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కని వారు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా చేరారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు ఫ్యాక్స్ లో పంపారు వేమిరెడ్డి.

వైఎసార్సీపికి రాజీనామా చేసిన వేమిరెడ్డి టీడీపిలో చేరనున్నారని సమాచారం అందుతోంది. టీడీపీ తరఫున నెల్లూరు ఎంపీగా పోటీ చేయనున్నారని, ఇందుకు చంద్రబాబు నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని కూడా టాక్ వినిపిస్తోంది. తానూ సూచించిన వారికి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ ఒప్పుకోకపోవటమే ఆయన రాజీనామాకు కారణం అని తెలుస్తోంది.

ఇక వైసీపీ నెల్లూరు రురల్ నుండి పోటీ చేస్తాడని భావించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయటంతో ఆ స్థానానికి అభ్యర్థిని వెతికే పనిలో పడింది వైసీపీ. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి రాజీనామా నెల్లూరు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.