నకిరేకల్, వెలుగు:శ్రీరామలింగేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ ఇచ్చారు. శనివారం ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ చైర్మన్ ఉప్పల రమేశ్‌తో పాటు ధర్మకర్తలతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తన వంతుగా సహకరిస్తానని దాతలు కూడా ముందుకు రావాలని కోరారు. తర్వాత మహాశివరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించడంతో పాటు ఈనెల 25న పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించనున్నమెగా జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించారు.