
నకిరేకల్, నార్కట్ పల్లి, వెలుగు: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్‌లపై ఆ పార్టీ నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. సోమవారం నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టి.. పూజలు చేశారు. ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నానని, ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.