నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు భరోసా ఇచ్చేందుకు పార్టీ సీనియర్ లీడర్లు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్య కార్యకర్తలతో ఆగస్టు 23న నకిరేకల్ లోని శ్రీనివాస గార్డెన్ లో మీటింగ్ నిర్వహించనున్నారు వీరేశం. అనంతరం ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. నకిరేకల్ నుంచి చిరుమూర్తి లింగయ్యకు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో వీరేశం పార్టీ వీడనున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్నారు.ఇప్పటికే ఆమె భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శ్యామ్ నాయక్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.సీఎం కేసీఆర్.. సోమవారం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఫస్ట్ లిస్టులో రేఖా నాయక్ పేరు లేకపోవడంతో ఆమె అసంతృప్తికి గురై.. పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు. ఖానాపూర్ అభ్యర్థిగా జాన్సన్ నాయక్‌ను బరిలోకి దింపారు కేసీఆర్.