- ఫండ్స్ విడుదల ఆర్డర్స్ నిలిపివేత
- ఉత్తర్వులు జారీ చేసిన ఎండోమెంట్
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంతో పాటు యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి టెంపుల్నుంచి కామారెడ్డి నియోజకవర్గంలోని గుడులకు నిధుల మళ్లిస్తూ తీసుకున్న నిర్ణయంపై సర్కారు వెనక్కి తగ్గింది. వేములవాడ గుడికి సంవత్సరానికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి, అవి ఇవ్వకుండా రాజన్న ఆలయం నుంచి కామారెడ్డి నియోజకవర్గంలోని టెంపుల్స్కు నిధులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఇతర పార్టీల లీడర్లు అఖిలపక్షంగా ఏర్పడి ఆందోళనలు చేయడంతో పాటు శనివారం వేములవాడ పట్టణ బంద్కు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇది తమ కొంప ముంచుతుందని భావించిన బీఆర్ఎస్సర్కారు ఫండ్స్ విడుదల ఆర్డర్స్నిలిపివేసింది.
కామారెడ్డి నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి ఎండోమెంట్సీజీఎఫ్(కామన్గుడ్ ఫండ్) నుంచి రూ.10 కోట్లు వినియోగించుకుంటున్నట్లు శుక్రవారం రాత్రి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం నాటి బంద్ ను విరవించుకున్నట్లు వేములవాడ జేఏసీ కన్వీనర్నేరేళ్ల తిరుమల్గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అది శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ప్రకటించారు. మరోసారి ఇలాంటి జిమ్మిక్కులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.