వేములవాడను అభివృద్ధి చెయ్యాలె

వేములవాడను అభివృద్ధి చెయ్యాలె

పోరాడి సాధించిన రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పది జిల్లాలను ఎక్కువ జిల్లాలుగా మార్చింది అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే. కానీ అన్ని ప్రాంతాల అభివృద్ధి మాటలకే పరిమితమైంది. కొన్ని ప్రాంతాలే ప్రగతి సాధిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాగా పేరు పెట్టినా రాజన్నకు ఎక్కువ నిధులు లేవు. అన్ని ప్రభుత్వ ఆఫీసులూ సిరిసిల్లలోనే ఏర్పాటవుతున్నాయి. వీటిలో కొన్నైనా వేములవాడలో పెడితే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశం దక్కుతుంది. ఆధ్యాత్మిక కేంద్రంగా పేరున్న వేములవాడ రాజన్న గుడికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. యాదాద్రికి పెట్టిన ఖర్చులో పావు వంత పెట్టినా వేములవాడ అభివృద్ధి చెందుతుంది. జాతర సమయంలో రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలి. లక్షలాది మంది భక్తులు వచ్చే వేములవాడకు నిధుల కేటాయింపు పెంచాలి. అన్ని రకాలుగానూ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వేములవాడ ఆలయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలా వచ్చిన ఆదాయం ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టినా వేములవాడ అభివృద్ధి చెందేది. - ముచ్కుర్ సుమన్ గౌడ్, కరీంనగర్