వేములవాడ రాజన్న హుండీ ఆదాయం రూ.1.07కోట్లు

వేములవాడ రాజన్న హుండీ ఆదాయం రూ.1.07కోట్లు

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలోని హుండీలను బుధవారం లెక్కించారు. గత 15 రోజుల్లో భక్తులు కానుకల రూపంలో రూ.కోటి7లక్షల48వేలు సమర్పించినట్లు ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ తెలిపారు.

అలాగే 227 గ్రాముల బంగారం, 6 కిలోల 600 గ్రాముల వెండి సమకూరిందన్నారు. ఆలయ ఓపెన్ శ్లాబ్​లో నిర్వహించిన లెక్కింపులో అబ్జర్వర్​చంద్రశేఖర్, ఆలయ ఉద్యోగులు, రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.