త్వరలోనే రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలు: ఆది శ్రీనివాస్

త్వరలోనే రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలు: ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ప్రభుత్వ విప్, వేములవాడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని ఓ గార్డెన్ లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో బిఆర్ఎస్ నాయకుడు, పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు మహ్మమద్ అక్రమ్ సుమారు 200 మంది సభ్యులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్. బీజేపికి వ్యతిరేకంగా లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు.

మన దేశం సెక్యులర్ దేశం.. ఇక్కడ హిందులు, ముస్లింలు సోదర భావంతో ఉంటారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు 4శాతం కల్పించారు. వేములవాడ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న శాదిఖాన నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని అన్నారు ఆది శ్రీనివాస్. దానికోసం ప్రతి ఒక్కరు శుశక్తులైన సైనికులుగా పనిచేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపిచ్చారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కింద ఆర్థిక సహాయం, రేషన్ కార్డుతో పాటు హెల్త్ కార్డులు కూడా త్వరలోనే  అందిస్తున్నామని అన్నారు.