వేములవాడ, వెలుగు: తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, కేవలం సీఎం కేసీఆర్ ఇంట్లోనే ఉద్యోగాలు వచ్చాయని వేములవాడ బీజేపీ అభ్యర్థి డాక్టర్చెన్నమనేని వికాస్‌రావు ఆరోపించారు. శుక్రవారం వేములవాడ రూరల్ మండలం బొల్లారం, లింగంపల్లి, హన్మాజిపేట, మల్లారం, జయవరం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, గ్రామాల్లో సరైన రోడ్లు కూడా లేవన్నారు.
తాను గెలిచాక మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వేములవాడలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. నిరుద్యోగుల కోసం ప్రతి మండలంలో నైపుణ్య అభివృద్ది కేంద్రాలను ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు జక్కుల తిరుపతి, ఇతర లీడర్లుపాల్గొన్నారు.