- తుల ఉమకు షాక్
- వేములవాడ బీజేపీ అభ్యర్థిగా వికాస్ రావు
- కన్నీటి పర్యంతమైన ఉమనామినేషన్ దాఖలు..
- పోటీలో ఉంటానని వెల్లడి
వేములవాడ, వెలుగు : వేములవాడ అభ్యర్థిని బీజేపీ మార్చింది. మొదట తుల ఉమకు టికెట్ ఇచ్చిన బీజేపీ హైకమాండ్.. చివరి క్షణంలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావును అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో తుల ఉమ కన్నీటి పర్యంతమయ్యారు. మొదట టికెట్ కన్ఫామ్ కావడంతో శుక్రవారం వేములవాడ పట్టణంలో దాదాపు 5 వేల మందితో ర్యాలీగా వెళ్లి తుల ఉమ నామినేషన్ వేశారు. తిప్పాపూర్ నుంచి మొదలైన ర్యాలీ తెలంగాణ చౌక్ వరకు కొనసాగింది. అయితే ఉమకు పోటీగా వికాస్ రావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియక బీజేపీ కేడర్అయోమయంలో పడింది. చివరి క్షణంలో మధ్యాహ్నం 2:30 గంటలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పార్టీ బీఫామ్‌ను వికాస్‌రావు తరఫున రిటర్నింగ్అధికారి కార్యాలయంలో అందజేశారు. ‘‘నక్సల్స్‌గా ముద్రపడిన వ్యక్తులకు బీజేపీలో టికెట్ ఎలా ఇస్తారు. నక్సలిజం కారణంగా బీజేపీ కార్యకర్తలు ఎంతోమంది చనిపోయారు” అని ఆయన కామెంట్ చేశారు.
దొరలపై పోరాడుత: ఉమ
బీఫామ్ వికాస్ రావుకు ఇచ్చారన్న విషయం తెలిసి.. ర్యాలీలో ఉన్న తుల ఉమ కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘రాష్ట్రంలో 75 ఏండ్లుగా దొరల ప్రాబల్యం ఉంది. ఒక బీసీ మహిళకు టికెట్వస్తే కుట్రలు చేసి అడ్డుకున్నారు. -మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ ఇటీవల ప్రకటించింది. కానీ రాష్ట్రంలో కనీసం 10 నుంచి 12 శాతం టికెట్లు కూడా మహిళలకు ఇవ్వలేదు. నాకు ఇచ్చిన టికెట్ రద్దు చేసి, నక్సలైట్అయినందునే ఇవ్వడం లేదని చెప్పడం దారుణం. నేను నక్సలైట్‌గా దొరల నుంచి విముక్తి కోసం కొట్లాడిన మాట నిజమే. దొరల నుంచి విముక్తి కోసం ఇకపైనా నా పోరాటం కొనసాగుతుంది. నేను కచ్చితంగా పోటీలో ఉంటాను” అని చెప్పారు.
ALSO READ: మహబూబ్‌నగర్ : ముగిసిన నామినేషన్లు