వేములవాడ బీజేపీ టికెట్పై ఉత్కంఠ వీడింది. తుల ఉమ పేరును మార్చారు. వికాస్ రావుకి టికెట్ ఇచ్చారు. వేములవాడ బీజేపీ ఎమ్మెల్యేగా తుల ఉమ పేరును ముందుగా ప్రకటించారు. తాజాగా ఆమె పేరును తొలగించారు. నామినేషన్ చివరి క్షణాల్లో వికాస్ రావుకి అధిష్టానం టికెట్ కేటాయించింది.
శుక్రవారం (నవంబర్ 10న) మహిళలతో కలిసి వేములవాడ పట్టణంలో తుల ఉమ భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ఉదయం తుల ఉమ, వికాస్ రావు ఇరువురు నామినేషన్లు దాఖలు చేశారు. నాలుగు రోజుల క్రితం తుల ఉమ పేరు బీజేపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.
వేములవాడ బీజేపీ టికెట్ ను తుల ఉమకు కేటాయించడంతో నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో నిరసనలు తెలిపారు. కొంతకాలంగా వేములవాడ టికెట్ పై బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా విబేధాలు కొనసాగాయి. మొత్తానికి చివరి క్షణంలో వికాస్ రావుకే బీజేపీ పార్టీ బీ ఫామ్ అందజేసింది.