మూడేళ్లలో సమస్యలన్నీ పరిష్కరిస్తా : చల్మెడ లక్ష్మీనరసింహారావు

వేములవాడ, వెలుగు: వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే మూడేళ్లలో నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తానని వేములవాడ బీఆర్ఎస్​ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు హామీ ఇచ్చారు. శుక్రవారం వేములవాడలోని మహాలక్ష్మి వీధిలో ఇంటింటా నిర్వహించారు. అనంతరం తన నివాసంలో కోనరావుపేట మండల కార్యకర్తలు, కుల సంఘాల లీడర్లతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ‌‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్​ చైర్ ‌‌ ‌‌పర్సన్​ మాధవి, దేవయ్య, కుమార్​, గూడూరి మధు, విజయ్, రాజు, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, వైస్ ఎంపీపీ సుమలత- పాల్గొన్నారు.