- కేటీఆర్ మీటింగ్ ముగిసిన కాసేపటికే..వేములవాడలో బీఆర్ఎస్కు షాక్
- పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్, కో ఆప్షన్ సభ్యురాలి రాజీనామా
వేములవాడ, వెలుగు : వేములవాడలో మంత్రి కేటీఆర్ సోమవారం నిర్వహించిన యువ సమ్మేళనం ముగిసిన కాసేపటికే ఆ పార్టీకి స్థానిక నేతలు షాక్ ఇచ్చారు. మంత్రి వెళ్లిన కొద్దిసేపట్లోనే వేములవాడ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, మున్సిపల్ కో అప్షన్ మెంబర్ పుల్కం లక్ష్మి, 14 వార్డు కౌన్సిలర్ బింగి మహేశ్తో పాటు వట్టెంల రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు చెక్కిళ్ల పర్శరాములు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు.
వేములవాడ కాంగ్రెస్అభ్యర్థి ఆది శ్రీనివాస్ సమ క్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజీనామా చేసిన వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ వైఖరి, పార్టీలో కొంత మంది నాయకుల తీరు నచ్చకనే రిజైన్ చేశామన్నారు. అలాగే తాము ఆశించిన అభివృద్ధి వేములవాడలో జరగలేదన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ ప్రజల్లో ఉన్నాడని, బీసీ నాయకుడికి అండగా ఉండాలనే కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.