ప్రతీ తెలంగాణ బిడ్డ..గౌరవంగా బతకాలి : చల్మెడ లక్ష్మీనర్సింహారావు

​​​​​​వేములవాడ, వెలుగు : తెలంగాణలో  ప్రతీ బిడ్డ గౌరవంగా బతకడమే సీఎం కేసీఆర్​ ధ్యేయమని వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ రూరల్​ మండలం చెక్కపల్లి గ్రామంలో గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ తనను కరీంగనర్‌‌‌‌‌‌‌‌కు చెందిన వాడినని అనుకుంటున్నారని.. కానీ తాను నియోజకవర్గానికి చెందిన వ్యక్తినేనన్నారు. అనంతరం అచ్చన్నపల్లి, బాలరాజుపల్లి తదితర గ్రామాలకు చెందిన పలు పార్టీల నాయకులు

యువకులు సుమారు 150 మంది బీఆర్​ఎస్​లో చేరారు. బుధవారం రాత్రి వేములవాడలో యువకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్​ ఏనుగు మనోహర్​రెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, ఎంపీపీ మల్లేశం యాదవ్, ప్యాక్స్​ చైర్మన్ తిరుపతి రెడ్డి, సెస్ డైరెక్టర్ దేవరాజం, పార్టీ రవి, బాల్ రెడ్డి, తిరుపతి, హన్మాండ్లు, పాల్గొన్నారు.