వేములవాడ, వెలుగు: లోకల్ వాడినైన తనను ఆశీర్వదించి సేవ చేసే అవకాశం కల్పించాలని వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ప్రజలను కోరారు. విలీన గ్రామమైన కోనాయిపల్లిలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేణుకా మాత ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాలుగు సార్లు ఓడినా తాను ప్రజల మధ్యనే ఉంటూ సమస్యలపై పోరాడుతున్నానన్నారు. ప్రజలు ఒకసారి ఆలోచించి ఓటేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో లీడర్లు సాయిని అంజయ్య, కొమురయ్య, రాకేశ్, తిరుపతి, దేవయ్య పాల్గొన్నారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్మికులకు అండగా ఉంటా
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌ఎఫ్‌సీఎల్)లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉంటానని రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ రాజ్‌ఠాకూర్ హామీ ఇచ్చారు. శనివారం ఆర్‌ఎఫ్‌సీఎల్ గేట్ వద్ద జరిగిన మీటింగ్‌లో ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులకు డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ లీడర్లు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.