వేములవాడ, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని, ఆ పార్టీలో గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి అది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడలోని హరిమల ఫంక్షన్ హాల్లో ముస్లిం, మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనంలో ఉండే నాయకుడు కావాలో, సిటీలో ఉంటూ గెస్ట్‌లా వచ్చే నాయకుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.
నాలుగు సార్లు ఓడినా ప్రజల మధ్యలోనే ఉన్నానని, ప్రస్తుత బీఆర్ఎస్అభ్యర్థి ఏనాడూ ప్రజలకు కనిపించలేదన్నారు. మైనార్టీ, బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్మాత్రమే ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ వెంకటేశ్, కొమరయ్య, మైనార్టీ లీడర్లు రజాక్, సాబీర్, యూసుఫ్, అన్వర్, చాంద్ ఫెరోజ్, రెహమాన్, రిజ్వాన్ పాల్గొన్నారు.