
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. ఆలయ ఆఫీసర్ల పర్యవేక్షణలో, ఎస్‌పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నడుమ 15 రోజుల హుండీలను లెక్కించగా రూ. 1,27,78,000 వచ్చాయని ఆఫీసర్లు తెలిపారు. వీటితో పాటు 90 గ్రాముల బంగారం, 9.800 కిలోల వెండి వచ్చినట్లు ఈవో కృష్ణప్రసాద్ చెప్పారు. హుండీ లెక్కింపులో ఆలయ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.