శివరాత్రికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి : విప్ ఆది శ్రీనివాస్

  •     విప్ ఆది శ్రీనివాస్ 

రాజన్నసిరిసిల్ల, వెలుగు : మార్చి మొదటి వారంలో మహాశిరాత్రి జాతర జరగనున్న దృష్ట్యా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేములవాడ టెంపుల్, మున్సిపల్ అభివృద్ధిపై అధికారులతో రివ్యూ మీటింగ్ ​నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఇప్పటికే రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిందని, వారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సులభంగా

వేగంగా దర్శనం చేసుకునేందుకు మూడు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. వేములవాడ గుడి చెరువు సుందరీకరణ పనులు పూర్తిచేయాలన్నారు.  ధర్మగుండంలో శానిటేషన్, నీటి శుద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. వేములవాడలోని సినారే ఆడిటోరియాన్ని పరిశీలించి దానిపై కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిపోర్ట్ ఇవ్వాలన్నారు. వేములవాడ –వట్టెంల, వేములవాడ–- కోరుట్ల రోడ్ల పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు.

మూలవాగుపై నిర్మాణంలోని బ్రిడ్జిని వానాకాలంలో పూర్తిచేయాలన్నారు. ​అప్పర్​మానేర్​కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరందేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్లు పి.గౌతమి, ఖీమ్యానాయక్,  ఆర్డీవో మధుసూదన్, ఈవో కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.