వేములవాడ, వెలుగు: పేదలకు అండగా ఉండి ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ మున్సిపల్ పరిధిలో ఎస్‌డీఎఫ్ నిధులతో పలు కుల సంఘ భవనాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో 34 కుల సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేశ్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పుల్కం రాజు, కనికరపు రాకేశ్, అన్నారం శ్రీనివాస్, అజయ్, శంకర్ పాల్గొన్నారు.