చందుర్తి, వెలుగు: వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చందుర్తి మండలం మరిగడ్డలో ఇల్లు కూలి పోయిన నేరెళ్ల సరోజన, మల్యాల రాజేశంను సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం సనుగుల గ్రామ శివారులో కొట్టుకుపోయిన రోడ్డును, కట్టలింగపేట కోతకు గురవుతున్న రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు తగ్గుముఖం పట్టేదాకా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు రామస్వామి, లీడర్లు నాగం కుమార్, గొట్టే ప్రభాకర్, జలపతి, గంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
మహానేత వైఎస్ఆర్
వేములవాడ, వెలుగు: ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్ఆర్ అని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని నిర్వహించారు. అంతకుముందు పట్టణంలోని తిప్పాపూర్‌లో వానలకు ఇల్లు కూలిపోయిన గసికంటి ఎల్లవ్వకు ప్రభుత్వం తరఫున రూ. 50 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్సహాయులను ఆదుకోవడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆయన వెంట ఆర్డీవో రాజేశ్వర్, వైస్‌చైర్మన్ బింగి మహేశ్, కనికరపు రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.