కొమురవెల్లి, వెలుగు: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి లడ్డు ప్రసాదం అందజేసి శాలువా కప్పి సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మల్లన్న స్వామి తమకు ఇష్ట దైవమని, స్వామి కల్యాణం చూడడానికి వచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట మండల కాంగ్రెస్అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్, నాయకులు చెరుకు రమణారెడ్డి, ఎల్లయ్య, నర్సింహులు, రమేశ్ఉన్నారు.