వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. గడిచిన 14 రోజుల్లో భక్తులు రూ.2కోట్ల 15లక్షల 67వేల నగదు, 71 గ్రాముల బంగారం, 13కి లోల600 గ్రాముల వెండిని కానుకల రూపంలో సమర్పించారు.
బుధవారం ఆలయ ఓపెన్ శ్లాబ్‌లో హుండీలను లెక్కించగా, ఆలయ కార్యనిర్వహణాధికారి కృష్ణ ప్రసాద్, సహ కార్యనిర్వహణాధికారులు పర్యవేక్షించారు. అలాగే రాజన్న ఆలయ వసతి గదుల బుకింగ్ కోసం ఈ–టికెటింగ్ అమలులోకి తీసుకువచ్చినట్లు ఈఓ కృష్ణప్రసాద్ తెలిపారు. టీ యాప్ఫోలియో (T APP FOLIO), మీ సేవా ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.