రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్నకు హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది. గత 13 రోజుల హుండీ ఆదాయాన్ని ఇవాళ లెక్కించగా ఒక కోటి, 49 లక్షల రూపాయల నగదు వచ్చింది. స్వామి వారి హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు 10 లక్షల రూపాయలు సమర్పించినట్లు గుర్తించారు. అలాగే నగదుతోపాటు ఆభరణాల రూపంలో బంగారం..305 గ్రాములు, వెండి 11 కిలోల వరకు వచ్చింది. కరోనా ఆంక్షల కారణంగా రెండేళ్లపాటు ఇబ్బందిపడిన భక్తులు.. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకు.. దర్శనాలకు భారీగా తరలివస్తూ ముడుపులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయానికి ఆదాయం పెరిగిందని తెలుస్తోంది.