రాజన్న హుండీ ఆదాయం రూ. 1.35 కోట్లు

వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ. 1.35 కోట్లు సమకూరింది. బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్ లో 21 రోజుల హుండీ ఆదాయాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో, ఎస్పీఎఫ్ పోలీసుల బందోబస్తు మధ్య లెక్కించారు. రూ.1 కోటి 35 లక్షలు నగదు, 102 గ్రాముల బంగారం, 11 కిలోల 200 వెండి గ్రాముల సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. హుండీ లెక్కింపులో ఆలయ అధికారులతో పాటు సత్యసాయి సేవా సమితి సభ్యులు
 పాల్గొన్నారు.