ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ అవరణలో ఉన్న దర్గా కోసం రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దర్గా నిర్వహణ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం గురించి తెలుసుకున్న పోలీసులు..ఇరు వర్గాలను చెదరగొట్టి..దర్గాకు తాళం వేశారు. వివరాల్లోకి వెళ్తే..
వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయ ఆవరణలో దర్గా ఉంది. అయితే ఈ దర్గాను రెండు ముస్లిం వర్గాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఓ వర్గం..ఈ దర్గాపై తమకే హక్కులు ఉన్నాయని..తాతల నాటి నుంచి తామే నిర్వహిస్తున్నామని వాదిస్తోంది. దీంతో కొన్నేళ్లుగా ఈ దర్గాపై రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిపై ఓ వర్గం కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే తాజాగా రెండు వర్గాల మధ్య దర్గా నిర్వహణపై మరోసారి వివాదం చెలరేగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
ALSO READ:ఇంకా జలదిగ్బంధంలోనే దుర్గమ్మ ఆలయం
దర్గా విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరగడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇరు వర్గాలను బయటకు పంపారు. అనంతరం దర్గాకు తాళం వేశారు. దర్గాపై ఎవరికి హక్కులు ఉంటే వారు సరైన ఆధారాలు, పత్రాలతో రావాలని పోలీసులు తెలిపారు.