వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భారీ అదాయం సమకూరింది. భక్తులు వివిధ రూపాల్లో హుండీల్లో సమర్పించిన కానుకలను ఆలయ ఓపెన్ స్లాబ్ లో బుధవారం లెక్కించారు.
ఏడు రోజుల్లో రూ.కోటి 46 లక్షల 79 వేల నగదు, 54 గ్రాముల బంగారం, 9 కిలోల వెండి వచ్చిందని అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపులో ఈవో కృష్ణ ప్రసాద్, ఏఈవోలు, ఉద్యోగులు, శివరామకృష్ణ భజన మండలి సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.