వేములవాడ రాజన్న ఆలయంలో అగ్ని ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో  అగ్ని ప్రమాదం జరిగింది.  వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ ఏరియాలో ఆలయ వసతి గదుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  గదుల్లో ఆరబెట్టిన  కొబ్బరి చిప్పలకు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదంతో స్థానికంగా పొగలు అలుముకున్నాయి. 

అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న  ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు. వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో వేలం ద్వారా టెండర్ దక్కించుకున్న కాంటాక్టర్ కి సంబంధించిన కొబ్బరి ముక్కలను రెగ్యులర్ గా అరబెట్టి విక్రయిస్తుంటారు.