రాజన్న హుండీ ఆదాయం రూ. 2 .31కోట్లు

రాజన్న హుండీ ఆదాయం రూ. 2 .31కోట్లు

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామికి హుండీ ఆదాయం రూ. 2.31 కోట్లు వచ్చిందని ఆలయ ఈవో వినోద్​రెడ్డి తెలిపారు. 14 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ ఈవో పర్యవేక్షణలో గురువారం ఓపెన్ స్లాబ్​లో లెక్కించారు. 

ఆలయ ఖజానాకు రూ. 2 ,31,65,333 నగదు, 201 గ్రాముల బంగారం, 16,200 కిలోల వెండి సమకూరినట్లు చెప్పారు. ఎస్పీఎఫ్​ సిబ్బంది బందోబస్తు నిర్వహించగా సేవా సమితి సభ్యులు, అధికారులు, సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.