వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయ హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. శనివారం వేములవాడ రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో బందోబస్తు మధ్య 21 రోజుల హుండీలను అధికారులు లెక్కించారు. ఆదాయం రూ.1.68కోట్లు రాగా బంగారం 242 గ్రాములు, వెండి 13.64కిలోలు వచ్చినట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు.
లెక్కింపులో ఆలయ ఉద్యోగుల తో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, భమిరాంబిక సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.అనుబంధ ఆలయం నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి 100 రోజుల్లో రూ.8 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.