వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి హుండీల ద్వారా రూ. కోటీ 14 లక్షల ఆదాయం వచ్చింది. 14 రోజుల్లో భక్తులు హుండీల్లో వేసిన కానుకలను మంగళవారం ఆలయ ఓపెన్ స్లాబ్ లో భారీ భద్రత మధ్య దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు. ఇందులో కోటి 14 లక్షల నగదు, 124.5 గ్రాముల బంగారం , ఏడున్నర కిలోల వెండి వచ్చిందని ఈవో కృష్ణ ప్రసాద్ తెలియజేశారు. హుండీ లెక్కింపులో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఏఈఓలు హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.