వేములవాడ రాజన్న ఆలయం మోస్ట్ పవర్ ఫుల్: కేంద్రమంత్రి బండి సంజయ్

వేములవాడ రాజన్న ఆలయం మోస్ట్ పవర్ ఫుల్: కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్: వేములవాడ రాజన్న ఆలయం మోస్ట్ పవర్ ఫుల్ అని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయానికి వెళ్లిన బండి సంజయ్.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియతో మాట్లాడుతూ.. మహా శివరాత్రి సందర్భంగా శక్తివంతమైన రాజన్నను దర్శనం చేసుకున్నానని తెలిపారు. దక్షిణ కాశీగా పిలువబడే రాజన్న ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి కూడా భక్తులు వస్తున్నారన్నారు. 

రాజన్న ఆలయం ఎంతో శక్తివంతమైన దేవస్థానమని.. ప్రధాని మోడీ కూడా వేములవాడ రాజన్నను దర్శనం చేసుకున్నారని గుర్తు చేశారు. దేశ ప్రధాని దర్శించుకున్నప్పటి నుంచి దేశ వ్యాప్తంగా వేములవాడ రాజన్న గురించి చర్చ జరుగుతోందని.. అప్పటి నుండి దేశ ప్రజలు కూడా వేములవాడకి వెళ్ళాలని అనుకుంటున్నారని తెలిపారు. మహా శివరాత్రి వేములవాడలో ఏర్పాట్లు చాలా బాగున్నాయని.. ఈఓ, సిబ్బంది, పలు సేవ సంస్థలకు అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తితో లాస్ట్ వరకు భక్తులకు సౌకర్యాలు కొనసాగించాలని సూచించారు.