వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయంలో చీరలు, పట్టు చీరలు, దోవతులు, శాలువాలు, పంచాల సేకరణ హక్కులకు నిర్వహించిన రీ టెండర్‌లో గతం కన్నా రూ.50 లక్షల మేరకు ఎక్కువ ఆదాయం సమకూరినట్లు ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. మంగళవారం కళాభవన్లో బహిరంగ వేలం నిర్వహించారు.
జనవరి 12 తొలిసారి టెండర్నిర్వహించగా రూ.1.01కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి వేలంలో రూ.1.51కోట్లకు టెండర్ దక్కింది. ఆలయానికి ఎక్కువ ఆదాయం సమకూర్చేందుకు రీటెండర్ నిర్వహించినట్లు ఈవో చెప్పారు. ఈ టెండర్ఈ మార్చి నుంచి 2 ఏండ్ల పాటు అమల్లో ఉంటుందని ఈవో తెలిపారు.