వేములవాడ రాజన్నకి కాసుల వర్షం .. రూ.1.86 కోట్ల ఆదాయం

వేములవాడ, వెలుగు :  వేములవాడ రాజన్న ఆలయానికి భారీగా అదాయం సమకూరింది. మంగళవారం ఆలయ ఓపెన్​స్లాబ్​లో హుండీలను లెక్కించారు. ఇందులో 14  రోజులకు రూ.1, 86, 42, 950 ఆదాయం వచ్చింది. 

బంగారం 360 గ్రాములు, వెండి 14 కిలోలు వచ్చింది. మేడారం జాతర వస్తున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా రాజన్నను దర్శించుకునే  భక్తుల సంఖ్య పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. ఈవో కృష్ణ ప్రసాద్​, ఏఈవోలు హరికిషన్​,జయకూమరి, శ్రీనివాస్​, ప్రతాప నవీన్​ ​పాల్గొన్నారు.