
వేములవాడ, వెలుగు: దక్షిణకాశీ వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చిన భక్తులు తొలుత ధర్మ గుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. అనంతరం ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, కోడెమొక్కు క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు.
సోమవారం శ్రీస్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా ఆదివారం సాయంత్రం వరకు అధిక సంఖ్యలో భక్తులు వేములవాడకు చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.