వేములవాడ​ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

వేములవాడ​ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

వేములవాడ​, వెలుగు : రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల  నుంచి  వచ్చిన భక్తులు తొలుత ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. తలనీలాల మొక్కు, కోడెమొక్కులు చెల్లించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. 

క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీస్వామివారిని దర్శించుకున్నారు. శ్రావణమాసం కావడంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  సోమవారం స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా అధిక సంఖ్యలో భక్తులు వేములవాడకు చేరుకున్నారు.