వేములవాడ, వెలుగు : రాష్ర్టంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భారీగా అదాయం సమకూరింది. మంగళవారం ఆలయ ఓపెన్ స్లాబ్ లో సీసీ కెమెరా పర్యవేక్షణ, ఎస్పీఎఫ్ భద్రత మధ్య హుండీలను లెక్కించారు.
24 రోజుల హుండీ అదాయం లెక్కించగా రూ.1.70కోట్లు, బంగారం 199 గ్రాముల100 మిల్లి గ్రాములు, వెండి15కిలోల 250 గ్రాములు సమకూరింది. ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, కరీంనగర్ ఏసీ చంద్రశేఖర్, ఆలయ ఉద్యోగులతో పాటు శివరామకృష్ణ భజన మండలి లెక్కింపులో పాల్గొన్నారు.