భక్తులతో పోటెత్తిన రాజన్న ఆలయం

  • స్వామివారి దర్శనానికి 5 గంటలు 

‌‌‌‌‌‌‌‌వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రావణమాసం సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. 

ఉదయమే ఆలయ స్థానాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రోచ్ఛరణ మధ్య స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. తెల్లవారుజామున కల్యాణ కట్టలో తలనీలాల మొక్కులు చెల్లించి ధర్మగుండంలో స్నానమచారించి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కోడెమొక్కు  చెల్లించి తమ కోరిన కోరికలు నెరవేరాలని వేడుకున్నారు.