
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామికి భారీగా హుండీ ఆదాయం వచ్చింది. 12 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని మంగళవారం ఆలయ ఓపెన్ స్లాబ్‌లో ఆలయ ఈవో వినోద్‌రెడ్డి పర్యవేక్షణలో ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు మధ్య లెక్కించారు. స్వామివారి ఖజానాకు రూ.1,44,06,154 నగదు, 710 గ్రాముల బంగారం, 14 కిలోల వెండిని భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.