వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పోచమ్మకు బోనాలతో మొక్కులు చెల్లించారు. ఆషాఢం సందర్భంగా టీఎన్జీవో ఆధ్వర్యంలో అమ్మవారికి పోతరాజు, శివపార్వతులు నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.కార్యక్రమంలో సిరిసిరి శ్రీరాములు, మూర్తి, చంద్రశేఖర్, కూరగాయల శ్రీనివాస్, హరిహరనాథ్, ఉద్యోగులు, అర్చకులు పాల్గొన్నారు.
కోటి నవదుర్గమ్మకు బోనాలు
కోరుట్ల, వెలుగు: కోరుట్లలోని శివ మార్కండేయ, కోటి నవదుర్గ ఆలయంలో శుక్రవారం ఆషాడ బోనాల జాతర నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలను పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ప్రధాన వీధుల గుండా ఆలయం వరకు ఊరేగింపుగా చేరుకున్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు బోనం ఎత్తుకుని ఉత్సాహాపరిచారు.
అనంతరం జువ్వాడిని పద్మశాలీ సంఘం నాయకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, కౌన్సిలర్లు ఎంబేరి నాగభూషణం, ఆడెపు కమల, జిందం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ , మహిళా అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు.