భక్తులతో కిక్కిరిసిన రాజన్న గుడి

భక్తులతో కిక్కిరిసిన రాజన్న గుడి

వేములవాడ, వెలుగు: సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వరు స సెలవులు రావడంతో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల భక్తులు తరలివచ్చారు. కోడె మొక్కులు  చెల్లించుకున్నారు. క్యూలైన్లు, కల్యాణకట్ట, ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీ కనిపించింది.

రేపు గుడి మూసివేత
సూర్యగ్రహణం సందర్భంగా రాజరాజేశ్వరస్వామి దేవస్థానంతోపాటు అనుబంధ ఆలయాలను మంగళవారం మూసివేయనున్నట్లు ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. 25న సుప్రభాత, ప్రాతకాల పూజ అనంతరం మూసివేస్తామని, సాయంత్రం 5-.35 గంటలకు సంప్రోక్షణ అనంతరం ఓపెన్​ చేస్తామని చెప్పారు.