వేములవాడ/కొడిమ్యాల, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కేంద్ర ఆర్కిటెక్చర్ బృందం శుక్రవారం పరిశీలించింది. -కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అదేశాలతో ఆలయాన్ని సందర్శించినట్లు టీం సభ్యులు కిశోర్‌కుమార్, మౌనిక తెలిపారు. మాస్టర్ ప్లాన్‌తోపాటు ఆలయ పరిసరాలను పరిశీలించారు. గతంలోనే ప్రసాద్ స్కీం అనుమతి కోసం ఎన్‌వోసీ ఇవ్వగా దేవాదాయశాఖ ఎస్ఈ దుర్గాప్రసాద్, దేవాదాయ స్థపతి స్థపతి వల్దినాయక్, ఈవో వినోద్ రెడ్డి నుంచి ప్రపోజల్స్ తీసుకున్నారు. వంద వసతి గదులు, నిత్యాన్నదాన కాంపెక్ల్ప్, భక్తుల క్యూ కాంప్లెక్స్, అడ్మిస్ట్రేటివ్ బిల్డింగ్, నిర్మాణాలపై సభ్యులకు వివరించారు.
అంతకుముందు కొండగట్టు అంజన్న ఆలయాన్ని సెంట్రల్ ఆర్కిటెక్చర్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆలయానికి మంచినీటి సౌకర్యం, ఎలిమినేషన్ రిసెప్షన్, వసతి గృహాలు, టాయిలెట్ బ్లాక్స్ నిర్మాణ అవసరాలను గుర్తించారు. కలెక్టర్ సత్యప్రసాద్ కు రిపోర్టు అందజేసి అనంతరం పనులను ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు ఏపీలోని కృష్ణా జిల్లా శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో రామకృష్ణారావు, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.