వేములవాడ, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ కుటుంబసమేతంగా ఆదివారం సందర్శించారు. వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించారు. కల్యాణ మండపంలో స్వామి వారి ప్రసాదాన్ని ఈవో వినోద్ రెడ్డి వారికి అందజేశారు. ఈఈ రాజేశ్, డీఈ మహిపాల్ రెడ్డి, ఏఈవో శ్రావణ్, ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, వెంకట ప్రసాద్, ఇన్‌స్పెక్టర్ రాజేందర్, శ్రీకాంతచారి, సింహాచారి పాల్గొన్నారు.
కమిషనర్‌తో విప్శ్రీనివాస్ చర్చలు
దేవాదాయ కమిషనర్‌తో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయ అభివృద్ధిపై చర్చించారు. రాబోయే మహాశివరాత్రి జాతర వైభవంగా నిర్వహించాలని, అందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.